లోగో పై ఫిర్యాదు.. మార్చేస్తామని ప్రకటించిన మింత్రా




ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రాకు గట్టి షాక్ తగిలింది. ఈ సంస్థ లోగో అభ్యంతరకరంగా, మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబైలో కేసు నమోదైంది. అవెస్తా ఫౌండేషన్‌కు చెందిన నాజ్ పటేల్ ఈ మేరకు గత ఏడాది డిసెంబర్ లో ఫిర్యాదు చేశారు. లోగోను మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. అంతేకాదు, ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈ లోగో అభ్యంతరకరంగా ఉందంటూ పోలీసులు నిర్దారించారు. దీంతో ఆ సంస్థకు నోటీసులు పంపారు. 

తమను కలవాలంటూ మింత్రా అధికారులకు ఆ నోటీసులో తెలిపారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన మింత్రా నిర్వాహకులు నెలలోపే లోగోను మార్చేస్తామని పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో లోగో మార్పుకు మింత్రా నిర్వాహకులు హామీ ఇచ్చారని ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండికార్ తెలిపారు. మార్పులు చేసిన లోగోను మింత్రా యాప్ విడుదల చేసింది. తమ  లోగోలో కొన్ని మార్పులు చేస్తూ కొత్త లోగోని రిలీజ్ చేసింది. ప్యాకేజింగ్ మెటీరియల్‌పైనా లోగోను మారుస్తోంది. కొత్త లోగోతో ఇప్పటికే ప్యాకేజింగ్ మెటీరియల్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు మింత్రా తెలిపింది.


Latest News
more

Trending
more