ఆకేరు వాగు ఒడ్డున గంగమ్మని దర్శించుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు




ఆకేరు వాగు ఒడ్డున గంగమ్మని దర్శించుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు

అక్షర విజేత మరిపెడ:-

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో రాష్ట్ర మంత్రులు సందడి చేశారు. గ్రామ శివారులోని  ఆకేరు వాగు ఒడ్డున భారాస  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి సొంత ఖర్చులతో గంగాభవాని ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్, మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రులకు నరేష్ రెడ్డి ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. మహబూబాబాద్ మాజీ శాసనసభ్యుడు శంకర్ నాయక్ గంగాభవాన్ని దర్శించుకున్నారు. అనంతరం వారంతా అక్కడే సామూహికంగా భోజనాలు చేశారు ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇల్లందు ఎమ్మెల్యే పోరం కనకయ్య ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్   మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి జిల్లా నాయకులు కోట వెంకటరెడ్డి యుగంధర్ రెడ్డి పెద్దపైన ఐలమల్లు రవి నాయక్ అంబరీష సత్యనారాయణ రెడ్డి కుడితి మహేందర్ రెడ్డి సుందర్ మెంతి అశోకు మాజీ సర్పంచి రామ్ నలబోలు ప్రవీణ్ రెడ్డి నలబోలు శ్రీకాంత్ రెడ్డి చింత మనోజ్ కుమార్ పురుషత్తేపురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
 


Latest News
more

Trending
more