అంబానీనే బురిడీ కొట్టించి చివరకు ఈడీకి దొరికాడు




అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించింది. కొంత మంది వ్యక్తులతో కలిసి  కల్పేష్ దఫ్తారి అనే వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ కు టోకరా కొట్టారు. ప్రత్యేక వ్యవసాయ, గ్రామ పరిశ్రమ పథకం విశేష్ కృష్ణీ, గ్రామ ఉద్యోగ్ యోజన (వీకేజీయూవై) స్కీమ్‌ 13 లైసెన్సులు తమ పేరిట ఉన్నాయంటూ వారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ను బురిడీ కొట్టించారు. తమ పేరిట ఉన్న ఈ 13 లైసెన్సులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కట్టబెట్టారు. ఇందుకు గాను రిలయన్స్ కంపెనీ వారికి 6.8 కోట్ల రూపాయలు చెల్లించింది. తరువాత 13 లైసెన్సులలో స్కామ్ జరిగినట్లు  గుర్తించిన రిలయన్స్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగింది. మోసం చేసిన  కల్పేష్ దఫ్తారిపై మని లాండరింగ్ కేసు నమోదయింది. ఈ కేసు విచారణను ఈడీ ప్రారంబించింది. 

ఈ విచారణలో పలు కీలక విషయాలను ఈడీ బయటికి తీసుకువచ్చింది. ఈ స్కామ్‌లో కల్పేశ్ దఫ్తరీతో పాటు అహ్మద్, పియూష్ వీరంగామ, విజయ్ గాడియా మరి కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఈ మోసం వెలుగులోకి రాకుండా ఉండేందుకు వీరు ఈ డబ్బును ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు ట్రాన్సఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. తరువాత కల్పేష్ దఫ్తారి, ఇతరులు ఈ డబ్బును ఉపయోగించినట్లు వెల్లడయ్యింది. దీంతో కల్పేష్ దఫ్తారికి చెందిన సంకల్ప్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 4.87 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీరిపై ఈడీ చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది. 


Latest News
more

Trending
more