ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న మహేశ్ బాబు కొత్త యాడ్..




దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా (SSMB29) కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు సిద్ధమవుతున్నారు. గ్లోబల్ రేంజ్‍లో అత్యంత భారీ బడ్జెట్‍తో ఆ చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రంతో బిజీ అయ్యే ముందు కొన్ని యాడ్స్ చేస్తున్నారు మహేశ్. ఇటీవల మహేశ్ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ బాబు ఇటీవల చేసిన ఓ యాడ్ వీడియో తాజాగా బయటికి వచ్చింది. సూపర్ స్టార్ అభిమానులను ఈ యాడ్ వీపరీతంగా ఆకట్టుకుంటోంది. 

మహేశ్ బాబు చేసిన మౌంటెన్ డ్యూ కొత్త యాడ్ బయటికి వచ్చింది. లాంగ్ హెయిర్‌లో కొత్త లుక్‍తో దీంట్లో మహేశ్ బాబు కనిపించారు. యాక్షన్ స్టంట్‍తో ఈ యాడ్ ఉంది. చిక్కుల్లో ఉన్న స్నేహితుడిని కాపాడేందుకు ఈ యాడ్‍లో రిస్క్ చేస్తారు మహేశ్. మొనగాడురా.. భయపడడురా అంటూ బ్యాక్‍గ్రౌండ్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఓ థ్రిల్లింగ్ యాక్షన్ సీన్‍లా ఈ యాడ్ సాగింది.

లయన్ కింగ్‍లా మహేశ్!

ఈ యాడ్‍లో మహేశ్ బాబు కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గాలికి మహేశ్ లాంగ్ హెయిర్ ఊగిన క్లిప్ బాగా వైరల్ అవుతోంది. సింహంతో మహేశ్ లుక్‍‍ను కొందరు పోలుస్తున్నారు. లయన్ కింగ్‍లా మహేశ్ ఉన్నాడంటూ ఓ మీమ్ కూడా బాగా వైరల్ అవుతోంది. రాజమౌళితో చేసే మూవీతో ప్రపంచాన్నిమహేశ్ బాబు ఏలేస్తాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్‍లో మూవీ (SSMB29) గ్లోబల్ రేంజ్‍లో ఉండనుంది. అడ్వెంచర్ యాక్షన్ ఈ సినిమా ఉండనుందని జక్కన్న ఇప్పటికే చెప్పేశారు. ఇటీవల ఈ చిత్రం లుక్ టెస్టు కూడా జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా మహేశ్ కోసం వివిధ గెటప్‍లను ట్రై చేసినట్టు సమాచారం.

SSMB29 సినిమా సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో రూపొందనుందని రూమర్లు వస్తున్నాయి. ఈ చిత్రంలో కొందరు హాలీవుడ్ నటులు కూడా ఉంటారని టాక్. ఇండోనేషియా నటి చెల్సీ ఇస్లాన్ ఈ మూవీలో నటించనున్నారని టాక్ బయటికి వచ్చింది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఏప్రిల్‍లో షూటింగ్ ప్రారంభమవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, షూటింగ్‍కు ముందే ఓ ప్రెస్‍మీట్ పెట్టి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను రాజమౌళి వెల్లడిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం అప్‍డేట్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్‍లోనూ రాజమౌళి చాలా పాపులర్ అయ్యారు. దీంతో ఈ మూవీపై గ్లోబల్ రేంజ్‍లో భారీ బజ్ నెలకొంది


Latest News
more

Trending
more