అశ్విన్, లయన్ నాకు మంచి సలహాలు ఇచ్చారు : కుల్దీప్




లయన్, అశ్విన్ తనకు మంచి సలహాలు ఇచ్చారని కుల్దీప్ యాదవ్ అంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకుండా ఇండియాకు తిరిగి వచ్చిన కుల్దీప్ తన మనసులో మాట చెప్పాడు.

తాను ఆస్ట్రేలియా పర్యటనలో మ్యాచ్‌లు ఆడకపోయినా ఎన్నో మెలకువలు నేర్చుకున్నానని అన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ లయన్, టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్ తనకు ఎన్నో గొప్ప సలహాలు ఇచ్చారని కుల్దీప్ వెల్లడించాడు. 'నేను లయన్‌తో చాలా సేపు బౌలింగ్ గురించి ముచ్చటించాను. మ్యాచ్‌కు ముందు ఎలా సన్నద్దం అవుతాడో అడిగాను. తను ఏ మాత్రం దాచుకోకుండా నాతో అన్ని విషయాలు చెప్పాడు. బంతిని వేళ్ల మధ్య ఎలా పట్టుకొని తిప్పుతాడో కూడా నాకు వివరించాడు.

అలాగే అశ్విన్ కూడా విలువైన సలహాలు ఇచ్చాడు. నేను బంతిని విసిరే పద్దతిలో కొన్ని మార్పులు సూచించాడు. వేగంతో పాటు నేరుగా విసరాలని సలహా ఇచ్చాడు. నేను, అశ్విన్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే ఇంగ్లాండ్ పర్యటన గురించి చర్చించుకున్నాము' అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చెన్నైలో భారత జట్టుతో కలసి బయోబబుల్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్.. తొలి టెస్టు కోసం సాధన చేస్తున్నాడు.


Latest News
more

Trending
more