లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్




ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, టాలీవుడ్ యువ సామ్రాట్  నాగ చైతన్య, అద్భుత  ప్రతిభగల బ్యూటిఫుల్ హీరోయిన్  సాయిపల్లవి ల కాంబినేషన్ లో వస్తున్న 'లవ్ స్టోరీ' మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తే చాలా మూవీల్లాగే రొమాంటిక్ మూవీ అని అర్దమవుతోంది. అయితే ఈ మూవీలో డ్యాన్స్ కు ప్రాధాన్యత ఉన్నట్టు కనపడుతోంది. 

మౌనిక (సాయి పల్లవి)  రేవంత్ (నాగ చైతన్య) ల ప్రేమ పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవడంతో వీళ్ళిద్దరు ఏంచేశారనే అంశం చుట్టూ ఈ మూవీ తిరుగుతుందనేది ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా లేటయ్యింది. ఈ నెల 10న రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ ఆ రోజు వేరే మూవీలు కూడా రిలీజ్ కావడంతో ఈ మూవీ రిలీజ్ ను మళ్ళీ వాయిదా వేసి ఈ నెల 24 న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీలోని పాటలు బహిళప్రచారం పొందాయి. 


Latest News
more

Trending
more