లవ్ స్టోరీ న్యూ రిలీజ్ డేట్ ఇదే...




శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవిల కాంబీనేషన్ లో వస్తున్న 'లవ్ స్టోరీ' మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు డిసైడ్ అయ్యింది. ఈ నెక 24న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రకటించారు. ముందుగా సెప్టంబర్ 10వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇదే రోజు మరి కొన్ని మూవీలు రిలీజ్ అవనుండటంతో లవ్ స్టోరీ రిలీజ్ ను వాయిదా వేశారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.  పవన్ సి.హెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ అందించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ మూవీలోని పాటలు ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి. 'సారంగదరియా' సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తోంది. ‘హే పిల్లా’, ‘నీ చిత్రం చూసి..’ పాటలు కూడా  వైరల్ అయ్యాయి. ఈ మూవీలోని పాటలు మ్యూజిక్ లవర్స్ నే కాకుండా సాదారణ ప్రజలను కూడా అల‌రిస్తున్నాయి. ఈ మూవీపై ఇప్పట్కే అనేక అంచనాలు నెలకొన్నాయి.


Latest News
more

Trending
more