వచ్చేవారం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్?




కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా తిరుగుతోందని మీకు తెలుసు కదా. తాజాగా ఈ టీమ్ సోమవారం నుంచి బుధవారం వరకూ..

జమ్మూకాశ్మీర్‌లో తిరుగుతుంది. ఇలా తిరుగుతూ.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు, ఎలా ఎన్నికలు జరపాలి అన్నది ఆ టీమ్ రాసుకుంటోంది. జమ్మూకాశ్మీ్ర్ అనేది కేంద్ర పాలిత ప్రాంతం కదా.. పైగా అక్కడ ఉగ్రవాదుల టెన్షన్ ఉంటుంది. అందుకే ఆ టీమ్ అక్కడ కూడా తిరిగి ఎన్నికలు ఎలా జరపాలో ప్లాన్ వేసుకుంటుంది. నిజానికి అక్కడ సెప్టెంబర్ లోగా ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల లోక్‌సభ ఎన్నికలతోపాటే.. అక్కడ కూడా ఎన్నికలు జరిపేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది.

వచ్చే బుధవారానికి జమ్మూకాశ్మీర్ టూర్ ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఢిల్లీకి వెళ్లిపోతుంది. రెడీ చేసుకున్న రిపోర్టును సమీక్షిస్తుంది. అలా.. షెడ్యూల్ రెడీ చేసుకుంటుంది. ఆ తర్వాత.. ప్రెస్ మీట్ పెట్టి.. నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చే గురువారం లేదా శుక్రవారం ఉండొచ్చని తెలుస్తోంది.

---- Polls module would be displayed here ----

ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే, ఆ క్షణం నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దాంతో కొత్త పథకాల అమలు సాధ్యం కాదు. ఉన్న పథకాల్లో కొన్నింటి అమలును కూడా ఆపేయవచ్చు. అందుకే రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతం పథకాల అమలు పనిలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా పథకాలను త్వరగా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక, ఎన్నికలు జరిపేందుకు జనరల్‌గా ఒక నెల టైమ్ ఇస్తుంది. అంటే.. ఏప్రిల్ రెండో వారం తర్వాత ఎన్నికలు జరుగుతాయి అనుకోవచ్చు. ఈ నెల రోజుల్లో ఎన్నికల అధికారులు ఫుల్ బిజీ అవుతారు. పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఈవీఎంల తరలింపు, కేంద్ర బలగాల తరలింపు, ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బందికి ఏర్పాట్లు, ఎండల్లో సమస్యలు రాకుండా ఏర్పాట్లు ఇలా చాలా ఉంటాయి. ఇక పార్టీల టెన్షన్ పార్టీలకు ఉంటుంది. చూద్దాం.. వచ్చేవారం నోటిఫికేషన్ వస్తుందేమో


Latest News
more

Trending
more