కూ యాప్ కు చైనా తో సంబంధాలు...ప్రమాదంలో యూజర్ల డాటా




ట్విట్టర్ తమకు సహకరించడం లేదనే కోపంతో బీజేపీ అగ్రనాయకులు దేశప్రజలందరినీ కూ యాప్ ఉపయోగించమని ప్రోత్సహిస్తున్నారు. తాము తీసేయాలన్న ట్వీట్లను తీసేయకపోవడం, బ్యాన్ చేయాలన్న అకౌంట్లను ట్విట్టర్ బ్యాన్ చేయకపోవడంతో కేంద్ర బీజేపీ మంత్రులకు కోపం నషాళానికి అంటింది. అందుకే అందరూ ట్విట్టర్ ను బహిష్కరించాలని భారత్ కు చెందిన కూ యాప్ వాడాలని పిలుపు ఇస్తున్నారు. 

అయితే కూ యాప్ కు నిజంగా విదేశాలతో సంబంధం లేనిదా ? కూ యాప్ వల్ల యూజర్లకు ఎలాంటి అపకారం లేదా అని ప్రశ్నించుకుంటే ఎన్నో నిజాలు బైటపడతాయి. అనేక అనుమానాలు రేకెత్తుతాయి. 
కూ యాప్ చైనాతో సంబంధం ఉన్నదనే విషయం తాజాగా బహిర్గతమంది. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా ఈ యాప్ వచ్చిందని చెబుతున్న ప్రచారంలో ఎటువంటి నిజంలేదన్నది నిజం. ఈ యాప్ లో  చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి అనుసంధాన కంపెనీ షున్ వే పెట్టుబడులున్నాయి. ఈ విషయాన్ని ఎవరో చెబితే నమ్మక్కర్లేదు కానీ స్వయంగా కూ యాప్ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణే ఈ విషయాన్ని తెలిపాడు. అయితే షున్ వే కంపెనీ త్వరలోనే ఇందులోనుంచి వెళ్ళిపోతుందని ఆయన చెబుతున్నాడు. 

ఇక కీ యాప్ కు సంబంధించిన మారో విషయం యూజర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ యాప్ ఎంత మాత్రం సురక్షితం కాదని తన యూజర్ల వివరాలను లీక్ చేస్తున్నదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. యూజర్లకు చెందిన ఫోన్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్ లు, ఈ మెయిల్ ఐడీలు, యూజర్ల ఇతర సమాచారాన్ని ఈ యాప్ లీక్ చేస్తున్నదని ఫ్రాన్స్ కు చెందిన సైబర్ పరిశోధకుడు రాబర్ట్ బాప్టిస్ట్ బైట పెట్టాడు. అదే కాక కూ యాప్ కు చైనా కు ఉన్న సంబంధాలను బహిర్గతపర్చే డొమైన్ రికార్డులను కూడా రాబర్ట్ బైట పెట్టాడు. యూజర్ల వివరాలను లీక్ చేస్తున్న స్క్రీన్ షాట్లను కూడా రాబర్ట్ సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశాడు. దీంతో బీజేపీ మంత్రుల పిలుపుతో కూ యాప్ లో చేరిన ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, మినిస్టర్స్ ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. 

 
 


Latest News
more

Trending
more