రైతులకు సామరస్యపూర్వక పరిష్కారం లభించాలి : విరాట్ కోహ్లీ




''రైతులు మన దేశంలో అంతర్భాగం. అందరమూ శాంతియుతంగా ముందుకు వెళ్లేలాగ, వారికి ఒక సామరస్యపూర్వక పరిష్కారం లభించాలి. అలా జరుగుతుందని నేను నమ్మతున్నాను'' అని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. రైతు ఉద్యమం నేపథ్యంలో ఇతర దేశాలకు చెందిన సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తుండటంతో.. కోహ్లీ కూడా స్పందించాడు.

రైతు ఉద్యమానికి సరైన పరిష్కారం లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు కోహ్లీ ట్వీట్లో పేర్కొన్నాడు. కాగా, అమెరికా పాప్ గాయని రిహానా, పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ సహా పలువురు సెలెబ్రిటీలు రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్లు పెట్టారు. దీంతో వీరిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది అంతర్గత విషయమని.. దీనిపై బయటి వాళ్ల జోక్యం ఏంటని ఆ ప్రకటనలో పేర్కొన్నది.

కేంద్రానికి మద్దతుగా సచిన్ టెండుల్కర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖులు కూడా ట్వీట్లు పెట్టారు. వీరి ట్వీట్లపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 


Latest News
more

Trending
more