సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నా.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రకటన




ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన చేశారు. మరికొన్ని రోజుల్లో సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నానని.. కేవలం ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ పదవిలో మాత్రమే కొనసాగుతానని చెప్పారు. అమెజాన్ ఉద్యోగులకు రాసిన లేఖలో బెజోస్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. అమెజాన్ ఒక గొప్ప ఆవిష్కరణ అని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బెజోస్ అన్నారు.

కాగా, అమెజాన్ సీఈవోగా అమెజాన్ వెబ్ సర్వీస్ చీఫ్ ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1997లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆండీ వెంటనే అమెజాన్‌లో చేరారు. ఆయనకు అమెజాన్‌తో విడదీయలేని అనుబంధం ఉన్నది. పబ్లిసిటీకి దూరంగా పని చేసుకుంటూ వెళ్లడం అతని నైజం.

కాగా, అమెజాన్‌ను జెఫ్ బెజోస్ 50 ఏళ్ల వయసులో 1994లో స్థాపించారు. మొదట్లో కేవలం ఆన్‌లైన్‌లో పుస్తకాలు మాత్రమే అమ్మేవాళ్లు. అలా మొదలైన అమెజాన్ ప్రస్థానం అంచెలంచలుగా ఎదిగింది. ప్రస్తుతం 77  ఏళ్ల వయసున్న బెజోస్ ప్రపంచంలోనే రెండో ధనవంతుడిగా పేరొందారు.


Latest News
more

Trending
more