టిక్‌టాక్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయలేరు




టిక్ టాక్‌ను ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. గతంలో టిక్ టాక్ లో అప్ లోడ్ చేసిన వీడియోలన్నింటినీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నారు. టిక్ టాక్ ఫీచర్లనే ఇన్‌స్టాగ్రామ్‌ సపోర్ట్ చేస్తుండటంతో యూజర్లు అవే వీడియోలను టిక్ టాక్ వాటర్ మార్క్ తోనే దీనిలో అప్ లోడ్ చేస్తున్నారు.

దీనివల్ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కాపీ కంటెంట్ ఎక్కువయి పోతున్నట్లు గుర్తించారు. ఇన్ స్టాలో కాపీ కాంటెంట్ పెరిగి పోతుండటంతో దాన్ని తయారు చేసిన ఉద్దేశం పక్కదారి పడుతున్నట్లు ఫేస్ బుక్ గుర్తించింది. దీంతో ఇకపై కాపీ కంటెంట్ అప్ లోడ్ చేయకుండా ఇన్‌స్టాగ్రామ్‌ అల్గారిథమ్ లో పూర్తిగా మార్పులు చేస్తున్నది.

ఒకపై రీల్స్ లో కేవలం ఒరిజినల్ కంటెంట్ మాత్రమే అప్ లోడ్ చేయడానికి వీలుంటుంది. యూజర్లు టిక్ టాక్ వాటర్ మార్క్ ఉన్న కంటెంట్ ను అప్ లోడ్ చేయవద్దని కోరతుున్నది. ఇకపై ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నిస్తే రీల్స్ దాన్ని సపోర్ట్ చేయదని వెల్లడించింది.


Latest News
more

Trending
more