భారత్ కు స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా




 

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు స్వర్ణపతకం వచ్చింది. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా స్వర్ణపతకం సాధించి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణపతాకం ఎగురవేశాడు. వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ అభినవ్ బింద్రా(2008 బీజింగ్ ఒలింపిక్స్) తర్వాత ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన రెండో ఆటగాడిగా హర్యానాకు చెందిన నీరజ్ ఘనత సాధించాడు. ఒలంపిక్స్ లో నిన్నటి వరకు 5 పతకాలు సాధించిన భారత క్రీడా కారులు ఈ రోజు నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా... రెజ్లర్ భజరంగ్ కాంస్యం సాధించాడు. దీంతో భారత్ మొత్తం 7 పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. 

 కాగా స్వర్ణ పతకం సాధించిన నీరజ్‌ చోప్రాకు అంత ఈజీగా పతకం రాలేదు. దీని వెనక నీరజ్ కఠోర శ్రమ ఉన్నది.  నీరజ్ ది హర్యాణాలోని  పానిపట్. అక్కడే డిగ్రీ చదివిన ఆయన ప్రస్తుతం  భారత సైన్యంలో నాయక్ సుబేదార్ గా పనిచేస్తున్నాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదటి నుంచే నీరజ్ దూకుడుగా ఆడాడు. మొదటి అవకాశంలోనే నీరజ్‌ 87.03 మీటర్లు విసిరాడు.


Latest News
more

Trending
more