‘మొగుళ్లు ‘మోదీ’ భజన చేస్తుంటే.. భోజనం పెట్టకండి’- కేజ్రీవాల్​




మోదీ భజన చేసే భర్తలకు రాత్రిళ్లు భోజనం పెట్టొద్దని మహిళలతో అన్నారు దిల్లీ సీఎం కేజ్రీవాల్​. తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భర్తలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భజన చేస్తుంటే.. వారికి భోజనం పెట్టొద్దని మహిళలకు పిలుపునిచ్చారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. ఈ మేరకు.. మహిళా ఓటర్లతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. చాలా మంది పురుషులు.. పీఎం మోదీ పేరు జపిస్తున్నారు. మీరు దానిని కరెక్ట్​గా సెట్​ చేయాలి. మోదీ భజన చేస్తే.. భర్తలకు రాత్రి భోజనం పెట్టకండి," అని.. దిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్​ సమారోహ్​ టౌన్​హాల్​ ఈవెంట్​లో కేజ్రీవాల్​ అన్నారు.

దిల్లీ బడ్జెట్​లో భాగంగా ఇటీవలే ఓ కీలక ప్రకటన చేసింది ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం. 18ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ. 1000 ఇస్తున్నట్టు వెల్లడించింది. దాని పేరు.. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన'. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ టౌన్​హాల్​ ఈవెంట్​ని నిర్వహించారు అరవింద్​ కేజ్రీవాల్​.

"మీ కుటుంబసభ్యులు అరవింద్​ కేజ్రీవాల్​కి, ఆమ్​ ఆద్మీకి మద్దతు ఇచ్చేలా.. వారి నుంచి మీరు ప్రతిజ్ఞ తీసుకోండి," అని దిల్లీ ముఖ్యమంత్రి అన్నారు.

2024 Lok Sabha elections : "విద్యుత్​ని నేను ఉచితంగా ఇస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పండి. బస్​ టికెట్లను నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఇక ఇప్పుడు.. ప్రతి నెల మహిళలకు రూ. 1000 ఇస్తున్నాను. బీజేపీ ఏం చేసింది? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? ఈసారి కేజ్రీవాల్​కి ఓటు వేయండి," అని ఆమ్​ ఆద్మీ సుప్రీమో తెలిపారు.


Latest News
more

Trending
more