బీసీసీఐపై మండి పడుతున్న హైదరాబాద్ క్రికెట్ అభిమానులు!




హైదరాబాద్ క్రికెట్ అభిమానులు బీసీసీఐపై మండి పడుతున్నారు. ఆదివారం బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు సీజన్-14 జరగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్‌ పాలక మండలి మే 6 దాకా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.  తదుపరి దశ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతించే విషయం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. మొత్తం ఆరు వేదికల్లో (చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా) ఈ టోర్నీ జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. 

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ముంబై, చెన్నైలలో మ్యాచులు నిర్వహిచేందుకు మొగ్గు చూపిన బీసీసీఐ తక్కువ కేసులు నమోదవుతున్న హైదరాబాద్ ను మాత్రం పక్కనబెట్టేయడం క్రీడా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ఐపీఎల్ ను నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ పట్టించుకోలేదు. దీనిపై బీసీసీఐని హైదరాబాద్ క్రీడా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉన్నా హైదరాబాద్ లో మ్యాచులు నిర్వహించకపోవడం బాధాకరమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినీ దర్శకుడు బీవీఎస్ రవి " హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వహించకపోవడం బాధాకరమని... ఎక్కువ కరోనా కేసులు ఉన్న ముంబైలో మ్యాచులా తక్కువ కేసులు ఉన్న హైదరాబాద్ లో మాత్రం మ్యాచులు నిర్వహించకపోవడం బీసీసీఐ చేస్తున్న తప్పు" అంటూ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ను కేటీఆర్ లైక్ చేయడం గమనార్హం. 


 


Latest News
more

Trending
more