ఇకపై హిమదాస్ డీఎస్పీ




భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌కు డీఎస్పీ ఉద్యోగం వరించింది. అస్సాం ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం మేరకు ఆమె ఆ రాష్ట్రంలోని క్లాస్-1 ఉద్యోగంలో నియమితురాలైంది. అస్సాం ముఖ్యమంత్రి సోనోవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర క్రీడా విధానంలో చేసిన సవరణలకు ఆమోదం లభించడంతో హిమదాస్ డీఎస్పీ నియామకానికి అర్హులయ్యారు.

ఇక ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, సీడబ్ల్యుజీ (క్లాస్ 1) మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్ సీనియర్ (క్లాస్ 2) పతక విజేతల నియామకం కోసం రాష్ట్రం ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ పాలసీకి సవరణను క్యాబినెట్ ఆమోదించింది. హిమదాస్ నియామకం పట్ల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేశారు.

20 ఏళ్ల అస్సాం స్టార్‌ స్పింటర్ హిమదాస్‌ 2018లో అద్భుతంగా రాణించింది. ఫిన్లాండ్‌లో జరిగిన అండర్‌-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది.

 


Latest News
more

Trending
more