పేద విద్యార్థులకు తోడ్పడుతా




పేద విద్యార్థులకు తోడ్పడుతా

ప్రధానోపాధ్యాయులు... సుదర్శన్...


అక్షర విజేత కామారెడ్డి బ్యూరో

మండలంలోని కొందాపూర్ లో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో సుమారు 20 మంది విద్యార్థులకు చదువు సంద్యలు , ఆటపాటలకు తానొక్కడే ఉంటూ పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు , మంచి మధ్యాహ్న భోజన సదుపాయం అందిస్తూ, బుధవారం పిల్లలకు ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ బెల్టులు, టైలను తన సొంత ఖర్చులతో అందజేశారు. ఉపాధ్యాయులు సుదర్శన్ ప్రవేట్ పాఠశాలకు దీటుగా మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉండాలనే ఉద్దేశంతోనే పలు కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన తెలిపారు.  9 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో ఉంటూ ఎంతోమంది విద్యార్థులను పై చదువులకు పంపించిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పవచ్చు, మూడో తరగతి పిల్లలు గణితంలో 20 ఎక్కాల వరకు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విధంగా పిల్లల్ని చదువు లో ముందుంచుతూ విద్యార్థులను సొంత పిల్లలుగా అన్ని విధాలుగా చేయూత  అందిస్తున్నందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పక్కనే ఉన్న బిల్డింగ్ కూల్చివేసి కొత్త బిల్డింగును నిర్మిస్తామని గతంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ప్రస్తుత (శాసనసభ్యులు)  ఎమ్మెల్యే కోటాలో నిధులు మంజూరయ్యాయని వెంటనే కాంట్రాక్టర్ అప్పచెప్తామని స్కూల్ కమిటీ చైర్మన్ తెలిసిన విషయమేనని ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి మండలంలో ఒక మంచి పాఠశాలకు కేటాయించిన నిధులు దుర్వినియోగపడకుండా విద్యార్థులకు నూతన బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రభుత్వ టీచర్ అతని వద్ద చదువుకున్న పిల్లల కోసం ఇంత తాపత్రయ పడడం గ్రామస్తులకు సైతం మా ఊరుకు ఒక మంచి ఉపాధ్యాయుడు మా పిల్లల కోసమే వచ్చాడని సంతోషిస్తున్నారు. ఎంతైనా సుదర్శన్ ద గ్రేట్ టీచర్ అని యువకులు అంటున్నారు.
 


Latest News
more

Trending
more