ధోనీని తలపించిన యువ క్రికెటర్...హెలీకాప్టర్ షాట్ తో జట్టును గెలిపించాడు




హెలీక్యాప్టర్ షాట్ అనగానే గుర్తుకొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్ లో హెలీ క్యాప్టర్ షాట్ కొట్టే ఒకే ఒక్క  ఆటగాడు ధోనీ. అయితే ధోనీని గుర్తు చేస్తూ మరో ఆటగాడు హెలీక్యాప్టర్ షాట్ తో సిక్స్ కొట్టి తన జట్టును గెలిపించాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హర్యాణా, బరోడా టీంల మధ్య బుధవారంజరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఈ ఫీట్ చేశాడు విష్ణు సోలంకి అనే ఆటగాడు. హర్యాణా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 148 పరుగులు చేసింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా జట్టు దూకుడుగా ఆడింది. అయితే హర్యాణా బౌలర్ మోహిత్ శర్మ కట్టుదిట్టమైన‌ బౌలింగ్ తో బరోడా జట్టుకు చివరి ఓవర్ లో 18 పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పటికే మంచి ఊపు మీదున్న విష్ణు సోలంకి మొదటి ఐదు బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఇక చివరి బంతిలో సిక్స్ కొట్టలేకపోతే ఓడిపోవడం తద్యం అనుకున్న దశలో సోలంకి చివరి బాల్ ను ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ కొట్టి ఆరు పరుగులు సాధించాడు. దాంతో బరోడా జట్టు హర్యాణా జట్టుపై నెగ్గి సెమీస్ కు చేరింది. ఇప్పుడు bcci.tv పోస్ట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Latest News
more

Trending
more