వివక్షకు పరిహారం చెల్లించనున్న గూగుల్




సాంకేతికంగా ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మనుషుల మధ్య అంతరాలు మాత్రం మాసిపోవడం లేదు. మరీ ముఖ్యంగా మహిళ పట్ల వివక్ష సర్వత్రా కనిపిస్తుంది. టెక్ దిగ్గజం గూగుల్ లోనూ మహిళా ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నారు. గూగుల్ తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల, ఆసియా దేశాల ప్రతినిధుల పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణల పట్ల స్పందించిన గూగుల్ యాజమాన్యం 5,500కు పైగా ఉద్యోగులకు 26 లక్షల డాలర్ల పరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ కి ముందు తమ సంసిద్ధతను వెల్లడించింది. 

కాలిఫోర్నియా, వాషింగ్టన్ గూగుల్ కార్యాల‌యాల్లో మ‌హిళా ఉద్యోగులు, ఆసియా దేశాల ఉద్యోగులపై యాజ‌మాన్యం వివ‌క్షాపూరితంగా వ్యవహరిస్తోందంటూ నాలుగు సంవత్సరా క్రితం ఆరోపణలు వెల్లువెత్తాయి. కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, సియాటెల్‌, కిర్క్లాండ్ కార్యాలయాల్లో ప‌ని చేస్తున్న మ‌హిళా ఇంజినీర్లకు వేత‌న చెల్లింపుల్లో వివ‌క్ష చూపినట్లు గూగుల్ పై ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన గూగుల్ వివక్షకు గురైన ఉద్యోగులకు పరిహారం చెల్లించడానికి సిద్ధమైంది. వేతనాల రూపంలో వివక్షను ఎదుర్కొన్న 2500 మంది మహిళా ఉద్యోగులకు 13.5 లక్షల డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించనుంది. 1,700 మందికి పైగా మ‌హిళా, ఆసియన్ ఉద్యోగులకు 12.3 ల‌క్షల డాల‌ర్ల ప‌రిహారం చెల్లించనుంది.


Latest News
more

Trending
more