అంబానీ చూపిన బాటలో అదానీ




ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ చూపిన బాటలో మరో వ్యాపార దిగ్గజం గౌతమ్‌ అదానీ నడవాలని నిర్ణయం తీసుకున్నారు. ముకేశ్ కు చెందిన  రిలయన్స్ కంపెనీ వ్యాపార రుణాన్ని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తమ వాటాలను విదేశీ కంపెనీలకు విక్రయిస్తూ భారీ లాభాన్ని ఆర్జించింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, సిల్వర్‌లేక్‌, అబుదాబి సహా వివిధ విదేశీ పెట్టుబడిదారుల నుంచి  సుమారు 27 బిలియన్ల డాలర్లను సంపాదించిన ఆ సంస్థ తమ రుణాన్ని జీరో చేసుకొని అగ్రగామిగా నిలిచింది. ఆయన దారిలో నడవాలని నిర్ణయం తీసుకున్న  గౌతమ్‌ అదానీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార రుణాన్ని తగ్గించుకునేందుకు గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఎల్)లో 20 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించారు. 

20 శాతం వాటా కోసం పలు కంపెనీలు పోటీ పడ్డాయి. చివరకు ఈ వాటాని ఫ్రెంచ్ దిగ్గజ కంపెనీ టోటల్ ఎస్‌ఈ  సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఏజీఎల్ కు 2.5 బిలియన్ డాలర్స్ ఆదాయం సమకూరింది. మన కరెన్సీలో చెప్పాలంటే 18,200 కోట్లుగా ఉండనుంది. సోలార్ పవర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఉన్న గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకోవడం పట్ల టోటల్ ఎస్‌ఈ తమ సంతోషాన్ని తెలియచేసింది. సోలార్‌ అసెట్ లో 50 శాతం వాటా అదానీ సొంతం. వస్త్ర వ్యాపారంతో పాటు విద్యుత్ సంస్థలను నిర్వహిస్తూ  అదానీ గ్రూప్ తమ బిజినెస్ ను పెంచుకుంటూ వచ్చింది. ఇటీవలే బ్యాంకింగ్ రంగంపై ద్రుష్టి సారించింది. ఈ విక్రయం ద్వారా  అదానీ గ్రూప్ షేర్ విలువ భారీగా పెరిగింది. 


 


Latest News
more

Trending
more