ఐసీఐసీఐ కుంభకోణంలో చందా కొచ్చార్‌కు బెయిల్




ప్రైవేటు రంగంలో అగ్రగామి బ్యాంక్ అయిన ఐసీఐసీఐలో కుంభకోణానికి సంబంధించి ఆ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌కు బెయిల్ లభించింది. ముంబయిలోని ప్రత్యేక మనీలాండరింగ్ కోర్టు ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీఐసీఐ, వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు.

శుక్రవారం విచారణకు హాజరైన ఆమెకు రూ. 5 లక్షల పూచికత్తుతో బెయిల్‌ను ఇస్తూ, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ముంబయిలోని మనీలాండరింగ్ కోర్టు జనవరి 30న చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్, ఇతరులపై సమన్లు జారీ చేసింది. దీనికి సంబంధించి చందా కొచ్చర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం బెయిల్ ఇచ్చింది.

కాగా, చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంకు రుణాల స్కామ్‌లో వీడియోకాన్ గ్రూపునకు రూ. 3,250 కోట్లను మంజూరు చేసినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె భర్తపై కూడా మనీలాండరింగ్ కెసు నమోదైంది. అనంతరం 2019లో సీబీఐ కేసును నమోదు చేయగా, ఈడీ 2020లో కేసు నమోదు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో చందా కొచ్చర్ దంపతులను ఈడీ అరెస్ట్ చేసింది.


Latest News
more

Trending
more