కోహ్లీ ఇలా డకౌట్ అవడం తొలి సారి..




ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరుగుతున్న రెండవ టెస్టులో టీమ్ ఇండియా పోరాడుతున్నది. తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్ శర్మ, అజింక్య రహానే నిలకడగా ఆడుతున్నారు. నయావాల్ చతేశ్వర్ పుజార అవుటైన తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పెవీలియన్ చేరాడు. అయితే అతడు అవుటైన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

మొయిన్ అలీ బౌలింగ్‌లో అనూహ్యంగా మలుపు తిరిగిన బంతి నేరుగా బెయిల్స్‌ను పడగొట్టింది. దాంతో కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. తన టెస్టు కెరీర్‌లో 26 సార్లు డకౌట్ అయిన కోహ్లీ.. ఒక స్పిన్నర్ బౌలింగ్‌లో సున్నా పరుగులకు వెనుదిరగడం ఇదే తొలిసారి.

అంతకు ముందు పేసర్ల బౌలింగ్‌లోనే డకౌట్ అయిన కోహ్లీని.. తొలి సారిగా మొయిన్ అలీ అవుట్ చేశాడు. గతంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ తరిండు కౌశల్ బౌలింగ్‌లో 3 పరుగులకు అవుటయ్యాడు. ఇప్పటి వరకు అదే అత్యల్ప స్కోర్. మరోవైపు వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో కోహ్లీ బౌల్డ్ అవడం కూడా ఇదే తొలిసారి.


Latest News
more

Trending
more