నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా




చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తమ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ప్రస్తుతం నాలుగు  వికెట్లు నష్టపోయి 73 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 555/8 పరుగుల వద్ద బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ మరో 23 పరుగులు జోడించి 578 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 218, సిబ్లే 87, స్ట్రోక్స్ 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. టీమిండియా బౌలర్లలలో బుమ్రా, అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా నదీమ్, ఇశాంత్ రెండేసి వికెట్లు తీశారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే టీమిండియా 379 పరుగులు చేయవలసి ఉంది. ఈ దశలో తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 19 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. డాషింగ్ బ్యాట్సమెన్ రోహిత్ శర్మ(6)ని జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి మిస్టర్ డిపెండబుల్ పుజారా క్రీజులోకి వచ్చాడు. 

పుజారా డిఫెన్స్ కి ప్రాధాన్యమివ్వడంతో టీమిండియా స్కోరు నత్తనడక సాగింది. దూకుడు కనబరిచిన గిల్ 5 ఫోర్లతో స్కోరు బోర్డులో చలనం తీసుకువచ్చాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడబోయిన గిల్(29) జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. రెండు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ జట్టును విరాట్-పుజారా ఆదుకునే ప్రయత్నం చేశారు. క్రీజులో ఉన్నంతసేపు టైమింగ్ కోసం ఇబ్బందిపడ్డ విరాట్(11) జట్టు స్కోరు 71 పరుగుల వద్ద మూడవ వికెట్ కు వెనుదిరిగాడు. ఈ వికెట్ ను డోమ్ బేస్ తీశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే క్రీజులోకి వచ్చారు. ఆ వెంటనే రహానే(1) కూడా వెనుదిరగడంతో టీమిండియా 4 వికెట్లు నష్టపోయింది.  ప్రస్తుతానికి టీమిండియా 26 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. పుజారా(26), పంత్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 306 పరుగులు చేయవలసి ఉంది. 


Latest News
more

Trending
more