టీమిండియాని ఫాలోఆన్ ఆడించ‌ని ఇంగ్లాండ్...




చెన్నై టెస్టులో నాలుగో రోజు లంచ్ విరామానికి ఇంగ్లాండ్ జట్టు 242 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్ నైట్ స్కోరు 6 వికెట్ల‌కు 257 ప‌రుగుల‌తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియా 337 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (85 నాటౌట్‌) అద్భుత పోరాటంతో టీమిండియా నాలుగో రోజు 80 పరుగులు జోడించింది. సుందర్ కు సహకరించే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో టీమిండియా ఇంగ్లాండ్ స్కోరు కన్నా 241 పరుగుల వెనుకబడి ఉంది. అశ్విన్(31), నదీమ్(0), ఇషాంత్(4), బుమ్రా(0) వెంట వెంటనే అవుట్ కావడంతో సుందర్ సెంచరీ చేయలేకపోయాడు. 

ఇంగ్లాండ్ బౌలర్లలో బేస్ 4, లీచ్, ఆర్చర్, ఆండర్సన్ చెరో రెండు వికెట్లు తీశారు. టీమిండియా ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. కానీ ఇంగ్లండ్ మాత్రం టీమిండియాను ఫాలోఆన్ ఆడించ‌కుండా రెండో ఇన్నింగ్స్ ఆడాల‌ని నిర్ణ‌యించుకుంది.  241 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో బ‌ర్న్స్ (0) డ‌కౌట‌య్యాడు. లంచ్ విరామానికి 2 ఓవర్లలలో ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 1 పరుగు చేసింది. సిబ్లే(0), లారెన్స్(0) పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.  


Latest News
more

Trending
more