టీమిండియాని చిత్తుచేసిన ఇంగ్లాండ్




చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియాపై ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండవ ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ ను 227 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ కు భారీ స్కోరు అందించిన రూట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఓవర్ నైట్ స్కోరు 39/1 పరుగుల వద్ద బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా  ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. పుజారా(15), గిల్(50), రహానే(0), పంత్(11) వెంట వెంటనే ఔట్ కావడంతో టీమిండియా 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ-అశ్విన్ జోడి వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకుంది. 

లంచ్ విరామం తరువాత విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 7వ వికెట్ కు 64 పరుగులు జోడించిన తరువాత టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ అవుట్‌ అయ్యాడు. 46 బంతుల్లో 9 పరుగులు చేసి బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నిలకడగా ఆడుతూ 104 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసిన కోహ్లీ ఔట్ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. ఆ తరువాత నదీమ్(0), బుమ్రా(4) పెవిలియన్ చేరడంతో టీమిండియా 192 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్టు చెన్నై వేదికగా 13న ప్రారంభం కానుంది. 


Latest News
more

Trending
more