రక్తదానం ప్రాణదానం లాంటిదే: మాజీమంత్రి ప్రత్తిపాటి గణపవరంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి




రక్తదానం ప్రాణదానం లాంటిదే: మాజీమంత్రి ప్రత్తిపాటి

గణపవరంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి

అక్షర విజేత గణపవరం

మనం దానం చేసే రక్తంలో ప్రతిబొట్టు మరొకరి జీవనరేఖగా వారి ప్రాణాలు నిలబెడుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. రక్తదానం, ప్లాస్మాదానం అంటే ఆపదలో ఉన్నవారికి పునర్జన్మనివ్వడమే అనే అవగాహన అందరిలో పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తలసేమియా రోగులతో పాటు ప్రమాదాల్లో క్షతగాత్రులకు రక్తం అత్యవసరం కాగా అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సోమవారం నాదెండ్ల మండలం గణపవరంలో జనసేన నాయకుడు మండలనేని చరణ్‌తేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రత్తిపాటి పుల్లారావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ప్రారంభించారు. మండలనేని చరణ్‌తేజ జన్మదినాన్ని పురష్కరించుకోని ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారు. 
రక్తదానం చేసిన రక్తదాతలను, చరణ్‌తేజ బృందాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక స్పృహతో చరణ్‌తేజ బృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందస్తున్నానని తెలిపారు.  రక్తదాన శిబిరాలే కాకుండా పేదలను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. చరణ్‌తేజ సేవాభావంతో మంచి ఆలోచనలు, ఆశయాలతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే పేద ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు.


Latest News
more

Trending
more