గ్యాస్ సిలిండర్‌ ధర మరోసారి పెంపు.. నెల వ్యవధిలో రూ. 125 పెరుగుదల




గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర చమురు సంస్థలు మరోసారి పెంచాయి. గృహ వినియోగ గ్యాస్ మాత్రమే కాకుండా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒకే నెలలో నాలుగు సార్లు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం గమనార్హం.

వంట గ్యాస్‌పై రూ. 25, వాణిజ్య గ్యాస్‌పై రూ. 95 పెంచారు. ఈ రోజు నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి. ఫిబ్రవరి 25న కూడా గ్యాస్ ధర రూ. 25 పెంచారు. తొలుత ఫిబ్రవరి 4న రూ. 25.. 15న రూ. 50 పెంచారు. మొత్తానికి ఒక నెల వ్యవధిలో గ్యాస్ ధర రూ. 125 రూపాయలు పెరిగింది. గత మూడు నెలల్లో రూ. 225 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది.

ఇక సిలిండర్‌పై వచ్చే సబ్సిడీని కూడా తగ్గించారు. గతంలో రూ. 200 వరకు సబ్సిడీ వచ్చేది. కానీ గత కొన్ని రోజులుగా ఈ సబ్సిడీ రూ. 40 పరిమితం అయ్యింది. గ్యాస్ ధరలు పెరుగుతున్నా.. సబ్సిడీ మాత్రం పెరగడం లేదు. తాజాగా విశాఖపట్నంలో సబ్సిడీ రూ. 4కు చేరుకోవడం గమనార్హం. గ్యాస్, పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్యుడు ఆందోళనకు గురవుతున్నాడు.


Latest News
more

Trending
more