లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలకు బల్లలు వితరణ లయన్స్ క్లబ్ వైరా




లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలకు బల్లలు వితరణ లయన్స్ క్లబ్ వైరా

అక్షర విజేత వైరా:
గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలకు వివిధ రకాల మౌలిక వసతులు కల్పించడంలో లయన్స్ క్లబ్ వైరా ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, గతంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాల లకు డిజిటల్ తరగతుల్లో భాగంగా టీవీ లు అందజేశామని విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా సామాగ్రిని ఇచ్చామని తల్లితండ్రులు కూడా పాఠశాలల యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నీటి సంఘం మాజీ అధ్యక్షులు దొడ్డ పుల్లయ్య  మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఇరవై వేల రూపాయలు నిధులు అందించానని మిగతా ఇరవై వేలు లైన్స్ క్లబ్ కాపా మురళి కృష్ణ గారి సహకారంతో ఈరోజు లక్ష్మీపురం పాఠశాలలో బల్లలు అందించడం జరిగిందని తెలిపారు ఈరోజు బల్లలు పంపిణీ కార్యక్రమంలో తాను భాగస్వామినయ్యానని భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలియజేసినారు మండలంలోని స్నానాల లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల యందు డాక్టర్ కాపా మురళీకృష్ణ మరియు గ్రామస్తులు దొడ్డ పుల్లయ్య  గారి తల్లి సుశీల గారి జ్ఞాపకార్థం నలభై వేల రూపాయలు విలువ కలిగిన ,విద్యార్థులు కూర్చునేందుకు, రాసుకునేందుకు ఉపయోగపడే ప్రత్యేకంగా తయారు చేయించిన బల్లలను పాఠశాలకు వితరణ చేసిన సందర్భంగా వారు పాల్గొని మాట్లాడినారు. క్లబ్ అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్రరావు మాట్లాడుతూ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులకు గ్రామస్తుల సహకారం అందించినట్లయితే ఆ పాఠశాలలో మంచి గుర్తింపుని తెచ్చుకుంటాయని ఆయన తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెలిశెట్టి నరసింహారావు క్లబ్ కార్యదర్శి అబ్బూరి రమేష్ కోశాధికారి చింతలపూడి వెంకటేశ్వరరావు గ్రామ మాజీ సర్పంచ్ అమ్మిక రామారావు, ఉపసర్పంచ్ మల్లు రామకృష్ణ, ఎస్.ఎం.సి మాజీ చైర్మన్ బొల్లం శ్రీనివాసరావు, నూతి వెంకటేశ్వరరావు,  పంచాయతీ కార్యదర్శి భారతి ,మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ చింతోజు నాగేశ్వరరావు వై బుచ్చి రామారావు, వజినేపల్లి చక్రవర్తి నాళ్ళ నాగేశ్వరరావు, కట్ల సురేష్ మరికంటి రాంగోపాల్ వెంకటాచారి సూరపనేని నాగేశ్వరరావు, మొక్క వెంకటేశ్వరరావు మొక్క శ్రీను కొండలరావు సువర్ణ లత అంగన్ వాడీ మంజుల తల్లితండ్రులు లలిత రేణుక,ఉష, శైలజ విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొనినారు
 


Latest News
more

Trending
more