భీమ్లా నాయక్ నుండి డేనియల్ శేఖర్ వచ్చేశాడు




power star pawan kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Bhimla naiyak  'భీమ్లా నాయక్' మూవీ నుండి సోమవారంనాడు డేనియల్ శేఖర్ ను పరిచయం చేసింది మూవీ యీనిట్. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోశియుమ్' కు రిమేక్ గా తయారవుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్, Rana daggubati రానా దగ్గుబాటి నటిస్తున్నారు. Sagar k chandra సాగర్ కె చంద్ర దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యణ్ భీమ్లానాయక్ గా నటిస్తుండగా రానా డేనియల్ శేఖర్ గా నటిస్తున్నారు. భీమ్లా నాయక్ ను కొద్ది రోజుల క్రితం పరిచయం చేసిన మేకర్స్ ఈ రోజు డేనియల్ శేఖర్ ను పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. 

పంచెకట్టులో ఉన్న రానా డెనియల్ శేఖర్ పాత్రలో అదరగొట్టారు. నిత్యా మీనన్ కు వార్నింగ్ ఇస్తూ...  ''నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్‏లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర..హీరో '' అనే రానా డైలాగ్ లు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. 
సితార ఎంటర్టైన్ మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. పవన్ కు జోడీగా నిత్యా మీనన్, రానాకూ జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న ఈ మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.


 


Latest News
more

Trending
more