ఇండియన్ క్రికెట్ టీంలో కరోనా కలకలం - ఇంగ్లండ్ తో చివరి టెస్ట్ రద్దు




ఇండియన్ క్రికెట్ టీం లో కరోనా కలకలం రేపింది. దీంతో ఇంగ్లాండ్, ఇండియా టీంల మధయ జరగాల్సిన చివరిదైన ఐదవ టెస్ట్ రద్దు చేశారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో దృవీకరించింది.

ఇండియన్ టీం ప్రధాన కోచ్ రవిశాస్త్రి,బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తరువాత, గురువారం టీమిండియా పిజియోథెరపిస్ట్‌ యోగేశ్‌ పర్మార్, సహాయ సిబ్బందిలో మరొకరికి  కూడా కోవిడ్‌ పాజిటివ్గా నిర్దారణ కావడంతో BCCI,ECB లు చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఆటగాళ్ళందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ వీళ్ళందరితో సన్నిహితంగా ఉన్న  పిజియోథెరపిస్ట్‌ యోగేశ్‌ పర్మార్, మరో సహాయకుడికి కరోనా పాజిటీవ్ గా తేలడంతో టెస్ట్ రద్దు నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.

ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో ఇండియా 2 టెస్టులు ఇంగ్లండ్ 1 టెస్టు గెలిచారు. చివరి టెస్ట్ రద్దు కావడంతో ఇక భారత్ గెలుపును ప్రకటించడం లాంచనమే. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


Latest News
more

Trending
more