శాకాహారం ఆర్డర్ చేస్తే... మాసాహారం తెస్తారా!




ఓ ఆన్ లైన్ ఫుడ్ స్టార్టప్ శాకాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారం డెలివరీ చేసింది. ఇప్పుడా కేసులో బెంగుళూరుకు చెందిన ఆ స్టార్టప్ కు కోర్టు జరిమానా విధించింది. ఏఈసీఎస్ లేవుట్ లో నివాసముండే విష్ణు బైతనారాయణ నాగేంద్ర అనే యువకుడు 2018 ఏప్రిల్ 23న ఫ్రెష్ మెనూ అనే ఫుడ్ స్టార్టప్ లో క్వినోవా సలాడ్ ఆర్డర్ చేశాడు. కాసేపటికి డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకువచ్చి ఇచ్చి వెళ్లాడు. డెలివరీ బాయ్ తెచ్చిన బాక్స్ పై శాఖాహా వంటకమని రాసుంది. కానీ... అది ఓపెన్ చేసిన నాగేంద్రకు మాత్రం చికెన్ కంటపడింది. అంతే... ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

తాను ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరే వంటకం పంపించడంపై ఆ స్టార్టప్ కు ఫిర్యాదు చేశాడు. ఆ సంస్థ అతడికి క్షమాపణలు చెప్పి, తాను చెల్లించిన మొత్తాన్ని వెనక్కి పంపిస్తామని హామీ ఇచ్చింది. కానీ, మాంసాహారం అంటే గిట్టని నాగేంద్ర ఈ తప్పిదాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. ఆ స్టార్టప్ కు వ్యతిరేకంగా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సంస్థకు రెండు సార్లు లీగల్ నోటీసులు పంపించాడు. 

యువకుడి ఫిర్యాదుపై వినియోగదారుల ఫోరం విచారణ చేపట్టింది. కాగా... అతడికి చికెన్ డెలివరీ చేయలేదని ఆ సంస్థ వాదించింది. దీంతో... గతంలో ఆ సంస్థ క్షమాణలు చెబుతూ రాసిన మెయిల్ ను ఫోరంకు సమర్పించాడు ఆ యువకుడు. సాక్ష్యాలను పరిశీలించిన ఫోరం స్టార్టప్ సంస్థ నుంచి తప్పుజరిగిందని గుర్తించింది. అందుకు జరిమానా రూ 5వేలు చెల్లించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 5వేలు చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించింది. 
 


Latest News
more

Trending
more