కలెక్షన్‌ కింగ్‌.. కుంగ్‌ ఫూ పాండా 4




పాండా అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. ఈ చిట్టి జంతువు చేసే విన్యాసాలు పెద్దలకూ ఇష్టమే! అదే జీవి 'కుంగ్‌ ఫూ పాండా' సినిమాగా వచ్చి చిన్నాపెద్దలందరినీ అలరిస్తున్నది.

2008లో హాలీవుడ్‌ నుంచి మొదలైన 'కుంగ్‌ ఫూ పాండా' ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం పలు దేశాల్లో ఈ నెల 8న విడుదలైంది. మొదటి ఆట నుంచే రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతున్నది.

రెండు రోజుల్లోనే ఏకంగా 52 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఇదే ఫ్రాంచైజీలో విడుదలైన గత చిత్రాల మైలురాళ్లను దాటుకుంటూ దూసుకుపోతున్నది. 2008లో విడుదలైన మొదటి 'కుంగ్‌ ఫూ పాండా' ప్రపంచవ్యాప్తంగా 632 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. 2011లో రిలీజైన రెండో చిత్రం 665 మిలియన్‌ డాలర్లు, 2016లో వచ్చిన మూడో సినిమా 521 మిలియన్‌ డాలర్లు రాబట్టాయి. తాజా చిత్రం ఇంతకు మించి కలెక్షన్లు చేస్తుందని ఇండస్ట్రీ టాక్‌. పలు దేశాల్లో ఇప్పటికే రిలీజై మంచి టాక్‌ తెచ్చుకున్న 'కుంగ్‌ ఫూ పాండా 4' ఈ నెల 15న భారత్‌లో విడుదల కానుంది.


 


Latest News
more

Trending
more