చేతులెత్తేసిన టీమిండియా బౌలర్లు…దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్




చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ దుమ్మురేపుతోంది. రెండవ రోజు లంచ్ విరామానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. రూట్ (156), స్ట్రోక్స్(63) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 263/3 పరుగుల వద్ద బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ తొలుత నిదానంగా ఆడింది. కానీ క్రీజులో కుదురుకున్న తరువాత స్ట్రోక్స్ టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కెప్టెన్ జో రూట్‌.. 260 బంతుల్లో 150 ర‌న్స్ చేశాడు.  నాలుగ‌వ వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో స్ట్రోక్స్ కేవలం 98 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ధాటిగా ఆడుతున్నారు. 

మొదటి రోజు 89.3 ఓవర్లు వేసి మూడు వికెట్లు మాత్రమే తీసిన టీమిండియా బౌలర్లు రెండో రోజు లంచ్ విరామం వరకు ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. ఇప్పటివరకు 29.3 ఓవర్లు వేసిన టీమిండియా 92 పరుగులు సమర్పించుకుంది. విరాట్ బౌలింగ్ లో ఎన్ని మార్పులు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి ఒక్కరిని సమర్థవంతంగా ఎదురుకున్న రూట్-స్ట్రోక్స్ జోడి నాలుగవ వికెట్ కు 92 పరుగులు జోడించింది. ఇదే జోరు కొనసాగితే ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయడం ఖాయంగా కనబడుతోంది. చివరి గంట ముందు డిక్లేర్ చేసి టీమిండియాకి ఇంగ్లాండ్ బ్యాటింగ్ అప్పగించనుంది. 
 
 


Latest News
more

Trending
more