ఈ నెల 15న గోవాలో బుమ్రా వివాహం!




టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ఈ నెల 15న ఓ ఇంటి వాడు కానున్నాడు. బుమ్రా వివాహ వేడుకలు ఈ నెల 14, 15న గోవాలో జరగనున్నాయి. ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు సందర్భంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి వైదొలగిన నేపథ్యంలో అతడి పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. బీసీసీఐ కూడా వ్యక్తిగత కారణాల వల్ల బుమ్రా సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో బుమ్రా వివాహం సినీ నటి అనుపమ పరమేశ్వరన్ తో జరగనుందని ప్రచారం జరిగింది. అనుపమ ద్వారకా వెళుతున్నట్లు ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. జరుగుతున్న ప్రచారంపై స్పందించిన అనుపమ తల్లి షూటింగ్ కోసమే తన కూతురు ద్వారకా వెళ్లిందని అంతే తప్పా ఇంకే కారణం కాదని స్పష్టం చేశారు. 

దీంతో బుమ్రా వివాహం నిజామా? కాదా? అనే సందేహం నెలకొంది. ఈ సందర్భంలో బుమ్రా వివాహ వార్త నిజమేనని తేలింది. బుమ్రా వివాహం చేసుకోబోయేది ఎవరినో కాదు స్పోర్ట్స్ యాంకర్ గా పనిచేస్తున్న సంజనా గణేశన్ ను. ఆమె గతంలో పలుమార్లు బుమ్రాను ఇంటర్వ్యూ చేసింది. వీరు నిండా ప్రేమలో మునిగిపోయినా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. వీరి పెళ్లి 14,15 తేదీల్లో గోవాలో జరగనుందట. దీన్నిబట్టి బుమ్రా ఇంగ్లండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు అందుబాటులో ఉండడం కష్టమేననిపిస్తోంది. బుమ్రా దీనిపై అధికార ప్రకటన చేయకపోయినా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. త్వరలోనే తన వివాహంపై బుమ్రా ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. 


Latest News
more

Trending
more