బుమ్రా వేస్తున్న స్పిన్ బౌలింగ్ చూశారా?




టీమ్ ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా స్పిన్ బంతులు వేయడం ఏమిటని అనుకుంటున్నారా? అవును ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రా ఇప్పుడు లెగ్ స్పిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెన్నైలో సాధన చేస్తున్న బుమ్రా.. టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ కుంబ్లేలా బంతులు విసురుతున్నాడు.

కుంబ్లేను అనుకరిస్తూ నెట్స్‌లో సాధన చేస్తున్న బుమ్రా వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. బుమ్రా ఇన్నాళ్లు యార్కర్లు వేయడం చూశాం. కానీ ఇప్పుడు లెజెండ్ కుంబ్లే బౌలింగ్‌ను అనుకరిస్తున్నాడు అంటూ బీసీసీఐ వ్యాఖ్యానించింది.

ఈ పోస్టుకు అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. బుమ్రా చక్కగా బౌలింగ్ చేస్తున్నావు. అచ్చం నా యాక్షన్ మాదిరిగానే ఉన్నది. నీ బౌలింగ్‌ను ఎంతో మంది యువ క్రికెటర్లు అనుసరిస్తున్నారు. నువ్వు ఎంతో మందికి స్పూర్తి. ఇంగ్లాండ్ సిరీస్‌లో తప్పకుండా రాణించాలని కోరుకుంటున్నాను అని కుంబ్లే అన్నాడు.

 


Latest News
more

Trending
more