ఒక్క బిట్ కాయిన్ విలువ.. రూ. 27 లక్షలు




క్రిప్టో కరెన్సీ రంగంలో బిట్ కాయిన్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. వర్చువల్ కరెన్సీగా పేరొందిన క్రిప్టో కరెన్సీ.. మనకు మామూలు నోట్ల రూపంలో ఉండవు. కేవలం వర్చువల్ విధానంలో ఆన్‌లైన్‌లో వీటి ట్రేడింగ్ జరుగుంది. మామూలు బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నట్లే క్రిప్టో కరెన్సీకి చెందిన సంస్థల్లో ఈ కరెన్సీని దాచుకోవచ్చు. మొత్తం క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్స్‌దే అగ్రస్థానం.

ఈ కరెన్సీ విలువ గత కొంత కాలంగా పైపైకి దూసుకొని పోయింది. శనివారం (ఫిబ్రవరి 6) నాటికి క్రిప్టో కరెన్సీ విలువ రూ. 90 లక్షల కోట్లకు చేరుకుంది. నెల రోజువ వ్యవధిలో ఈ కరెన్సీ విలువ 200 బిలియన్ డాలర్ల మేర వృద్ది చెందింది. కాగా, ఈ కరెన్సీలో బిట్ కాయిన్స్ వాటా రూ. 53 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే క్రిప్టో కరెన్సీ మొత్తం విలువలో బిట్ కాయిన్‌కు సగానికి పైగా వాటా ఉన్నది. బిట్ కాయిన్ తర్వాత స్థానంలో ఎథేరియమ్ ఉన్నది.

మరోవైపు ఒక్క బిట్ కాయిన్ విలువ రూ. 29.11 లక్షలుగా ఉన్నది.


Latest News
more

Trending
more