ఆచార్యగా మారిన డేవిడ్ వార్నర్




ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆచార్యగా అవతారమెత్తాడు. టాలీవుడ్ సినిమాలంటే ఇష్టపడే వార్నర్ తాజాగా చిరంజీవి ఆచార్య లుక్ లో దర్శనమిచ్చాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న వార్నర్ గత కొద్దీ కాలంగా తెలుగు సినిమాలను ఫాలో అవుతూ వస్తున్నారు. మన హీరోలను అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. ప్రభాస్ వంటి హీరోలను అనుకరిస్తూ స్పూఫ్ లు, మహేష్ బాబు సినిమా, అల...వైకుంఠపురంలో సినిమాల డైలాగ్స్ చెబుతూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు. తన కుటుంబంతో కలిసి బుట్టబొమ్మ అనే సాంగ్ కు డాన్స్ చేశారు. దీంతో వార్నర్ సతీమణిని నెటిజన్స్ వదినా అని పిలవడం మొదలెట్టారు. లేటెస్ట్ గా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా అభిమానుల విజ్ఞప్తితో ఫీల్డ్ లోనే సిగ్నచేర్ మూమెంట్ చేశాడు. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా టీజర్ ఇటీవలే విడుదలయింది. ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. మన సినిమాలను ఫాలో అయ్యే వార్నర్ ఈ టీజర్ చూశాడు. ఇంకేముంది తన టాలెంట్ ను బయటికి తీశాడు. రీఫేస్ యాప్ సాయంతో ఆచార్యలా తయారైన వార్నర్... అచ్చం మెగాస్టార్ ను తలపించేలా డైలాగులు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగా అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. 29న విడుదలైన ఈ సినిమా టీజర్ ఇప్పటివరకు 10 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 573k లైక్స్ తో బెస్ట్ టాలీవుడ్ టీజర్ గా రికార్డు సృష్టించేందుకు దూసుకెళ్తోంది. 


Latest News
more

Trending
more