దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు ...ఒకే ఒక మార్పు చేసిన సీఏ




క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దక్షిణాఫ్రికా పర్యటనకు తమ జట్టును ప్రకటించింది. టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఓటమి చెందిన ఆసీస్ ఇంట బయట విమర్శల పాలైంది. జట్టును ప్రక్షాళన చేయాలని విమర్శలు వెల్లువెత్తాయి. షేన్ వార్న్, ఇయాన్ ఛాపెల్ లాంటి దిగ్గజాలు కూడా జట్టులో మార్పులు చేయాలని కోరారు. కానీ ఈ విమర్శలను పట్టించుకోని సీఏ పెద్దగా మార్పులు చేయకుండానే దక్షిణాఫ్రికా పర్యటనకు ఆసీస్ జట్టును ప్రకటించింది. ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదురుకుంటున్న కీపర్ & బ్యాట్సమెన్  వేడ్ మాత్రమే జట్టులో స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో అలెక్స్ క్యారీ జట్టులో చేరాడు. ఈ సిరీస్ లో ఆసీస్ మూడు టెస్టుల ఆడనుంది. టెస్టు సిరీస్ డేట్స్ ఖరారు కాకముందే సీఏ జట్టును ప్రకటించడం గమనార్హం. 19 మంది కూడిన జాబితాను బోర్డు ప్రకటించింది. 

ఆసీస్ జట్టు: పైన్ (కెప్టెన్), కమ్మిన్స్ (వైస్ కెప్టెన్), హ్యారిస్, వార్నర్, స్మిత్, లబుషేన్, సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, కెమెరాన్ గ్రీన్, హాజల్ వుడ్, ట్రావిస్ హెడ్, హెన్రిక్స్, లియోన్, మిచెల్ నాసర్, ప్యాటిన్సన్, విల్ పుకోవిస్కి, మిచెల్ స్టార్క్, మార్క్ స్టెకేటీ, స్వీప్సన్ 
 


Latest News
more

Trending
more