అమెజాన్ లో ఆవు పిడకలు...టేస్ట్ బాగాలేదంటూ రివ్యూ




ఈ కామర్స్ దిగ్గజం 'అమెజాన్' వ్యాపార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఎటువంటి వస్తువయినా  దొరుకుతుందని ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు అమెజాన్ పై ఆధారపడుతున్నారు. లక్షలాది మంది భారతీయులు విదేశాలలో స్థిరపడ్డారు. వారి కోసం పండుగల పూట వాడే ఆవు పిడకలను కూడా 'అమెజాన్' అమ్ముతోంది. ఆవు పిడకలను ‘కౌవ్‌ డంగ్‌ కేక్‌’ అనే పేరుతో లిస్ట్ లో ఉంచింది. దీనిని మన భారతీయులు సులభంగా అర్ధం చేసుకోగలరు కానీ వాటిని ఎందుకు వాడుతారో విదేశీయులకు తెలియదు.  అమెజాన్ చాలా స్పష్టంగా సాంప్రదాయా కార్యక్రమాలు వాడే పిడకలు ఆవు పేడతో తయారు చేసినవి అని ప్రోడక్ట్ కింద రాసినా ఓ విదేశీయుడు తినే కేక్ అని భావించి ఆర్డర్ చేశాడు. కౌవ్‌ డంగ్‌ కేక్ తిన్న తరువాత ఆయన తన రివ్యూను యాప్ లో పోస్ట్ చేశాడు. ఈ రివ్యూని చూసి నెటిజన్స్ నవ్వులలో మునిగిపోయారు. 

" నేను వీటిని తిన్నాను. ఛీ టేస్ట్ బాగాలేదు. మట్టి, గడ్డితో కలిపి ఈ కేక్ చేసినట్లు ఉంది. వీటిని తిన్న తరువాత నాకు మోషన్స్ పట్టుకున్నాయి. దయచేసి ఇకపై తయారు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి" అంటూ రివ్యూ ఇచ్చాడు. ఈ రివ్యూని నవంబర్ 20న ఆ విదేశీయుడు పోస్ట్ చేశాడు. ఆ రివ్యూని తాజాగా సంజయ్ ఆరోరా అనే డాక్టర్ గమనించాడు. అతని రివ్యూని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. స్పష్టంగా అమెజాన్ ఇచ్చినా చూడలేదా? అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం యే మేరా ఇండియా.. ఐ లవ్‌ ఇండియా అంటూ కామెంట్ చేశారు. 


Latest News
more

Trending
more