థమన్ అల అమెరికా పురంలో సర్వం సిద్దం




తెలుగు సంగీతంలో ప్రస్తుతం తమన్ కాలం నడుస్తోంది. అనేక మూవీల్లో హిట్ మ్యూజిక్ అందించి దూసుకపోతున్నాడు తమన్. ప్రతి ఒక్క దర్శకుడు తమ మూవీలకు తమన్ మ్యూజిక్ కావాలని కోరుకుంటున్నారు. తమన్ మ్యూజిక్ అంటే విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా చెవులు కోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో తెలుగువారి కోసం తమన్ అద్వర్యంలో ఓ మ్యూజిక్ కాన్స‌ర్ట్స్ జరగబోతోంది. దాని పేరు 'అల అమెరికా పురంలో'

అమెరికాలోని డల్లాస్,న్యూ జెర్సీ,వాషింగ్టన్ డీసీ , సాన్ జోస్ లలో జరిగే ఈ కాన్సర్ట్ ను హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఏర్పాటు చేస్తున్నది. ఓవర్సీస్ లో పెద్ద పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ లు ఏర్పాటు చేయడంలో ఈ సంస్థకు పెద్ద చరిత్రే ఉంది. 


ఈ మ్యూజిక్ కన్సర్ట్ లో అనేక మంది స్టార్ హీరోయిన్లు, సినీ ప్రముఖులు పాల్గొంటారు. వాళ్ళతో పాటు  థమన్ మ్యూజిక్ ట్రూప్ లో డ్రం స్పెషలిస్ట్ శివమణి, నవీన్, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, సిద్ధాంత్‌, ష‌దాబ్ రాయిన్ వంటి అనేక మంది ఉన్నారు. అలాగే దీపావ‌ళి రోజున జ‌రిగే ఈ కాన్స‌ర్ట్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మరియు స్టార్ హీరో ముఖ్య అతిధులు గా హాజరు కానున్నారు.

అమెరికాలోని వివిధ నగరాల్లో జరిగే ఈ కాన్సెర్ట్ వివరాలు...
డల్లాస్, టి ఎక్స్ – అక్టోబర్ 30, 2021
న్యూ జెర్సీ – నవంబర్ 5, 2021
వాషింగ్టన్ డీసీ – నవంబర్ 7, 2021
సాన్ జోస్  – నవంబర్ 26, 2021 


Latest News
more

Trending
more