అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బైక్‌ర్యాలి పాల్గొన్న: సీపీఐ, కాంగ్రెస్‌, అగ్రిగోల్డ్ అసోసియేష‌న్ స‌భ్యులు




అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి 
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బైక్‌ర్యాలి పాల్గొన్న: సీపీఐ, కాంగ్రెస్‌, అగ్రిగోల్డ్ అసోసియేష‌న్ స‌భ్యులు

అక్షర విజేత చిలకలూరిపేట


చిల‌క‌లూరిపేట‌:అగ్రిగోల్డ్ బాధితుల స‌మ‌స్య‌లు తీర్చ‌టంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ది క‌రువైంద‌ని ప‌లువురు నాయ‌కులు విమ‌ర్శించారు.  అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ప‌ట్ట‌ణంలో బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో చిన్న మదుపుదారులు అందరికీ న్యాయం చేస్తానని, ఆరు నెలల్లో బాధితులం దరికీ పూర్తిన్యాయం చేస్తానని తన పాద యాత్రలో, ఎన్నికల ప్రచారంలో ప్రతీ నియోజక వర్గంలో మాట ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది బాధిత కుటుంబాలతో ఓట్లు వేయిం చుకొని గద్ద నెక్కార‌ని, ఐదు సంవ‌త్స‌రాలుగా అగ్రిగోల్డ్ బాధితులకు ఎటువంటి న్యాయం జరగకపోవ డం బాధాకరమన్నారు.   ఇప్ప‌టి వ‌ర‌కు రూ906 కోట్లు మాత్ర‌మే రూ. 20వేలు చెల్లించిన బాధితుల‌కు న‌గ‌దు జ‌మ‌చేశార‌ని, ఇంకా రూ. 3,080 కోట్లు మ‌రో 20ల‌క్ష‌ల మందికి అంద‌వ‌ల‌సి ఉంద‌న్నారు. చివర బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం కొంత అమౌంటు కేటాయిస్తారని వేయికళ్లతో ఎదురు చూసాం కానీ ఈ చివరి బడ్జెట్లో కూడా ఎటువంటి కేటా యింపులు చేయకపోవడం దారుణమన్నారు. ఇక‌నైనా అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్య‌క్షుడు  కె మంత్రునాయ‌క్‌, సీపీఐ ఏరియా కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ‌సుబ్బ‌య‌మ్మ‌, కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ఎం రాధాకృష్ణ , ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్షుడు పేలూరి రామారావు, బి భ‌గ‌త్ సింగ్‌, అసోసియేష‌న్ స‌భ్యులు బి కోటేశ్వ‌ర‌రావు,డి శివ‌కోటేశ్వ‌ర‌రావు, టి ప‌వ‌న్‌కుమార్‌, ఎస్ సుబ్ర‌మ‌ణ్యం, కోటేశ్వ‌ర‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు న‌సిరుద్దీన్‌, షేక్ క‌రిమూన్‌,ఖాజాబుడే, షేక్ బాజి, ఈశ్వ‌ర్‌, రాజా, బాష‌, కారుచోల సంప‌న్న‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Latest News
more

Trending
more