బడ్జెట్ : పెరగనున్న ఇంధన ధరలు




2021-22కి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. పన్నుకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆరోగ్యం, వ్యవసాయం, మౌళిక సదుపాయాల అభివృద్ది, పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆర్దిక మంత్రి తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగతూ వస్తున్నాయి. తాజా బడ్జెట్‌లో వాటిపై అదనంగా వ్యవసాయ సెస్సును జోడించారు. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.50 పైసలు, డీజిల్‌పై రూ. 4 పెంచారు. దీంతో పెట్రో దరలు మరింతగా మండిపోనున్నాయి. ఇప్పటికే రూ. 100 దరిదాపుల్లో ఉన్న పెట్రోల్ ధర.. మరింతగా పెరగనున్నది.

మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణకు ఎన్టీయే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం కారణంగా డీలా పడిన మార్కెట్‌కు ఊతం ఇచ్చేందుకు కొన్ని పథకాలు ప్రకటించడంతో మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. మదుపర్లు కొనుగోళ్లు చేయడంలో ఉత్సాహం చూపించడంతో కాసేపు బుల్ రన్ కొనసాగింది.

కేంద్రం ప్రకటించిన స్క్రాప్ విధానంతో ఆటోమొబైల్ రంగ షేర్లు ఊపందుకున్నాయి. బ్యాంకింగ్ షేర్లు కూడా భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఇక కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కోసం రూ. 35 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో ఆరోగ్య రంగానికి చెందిన కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి.


Latest News
more

Trending
more