
విజేత,తాండూరు : మనిషి ఆరోగ్యానికి ఉదయం చేసే యోగ ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హైస్కూల్ గ్రౌండ్ లో జైశ్రీరామ్ వాకింగ్ టీం సభ్యులు ఆర్ శరణు బసప్ప డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి రోజువారి దినచర్యలో డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం చాలా ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ప్రతి మనిషి రోజువారి జీవనశైలిని మార్చుకొని నిత్యజీవితంలో యోగ వాకింగ్ లను అలవర్చుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు. యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం అని సూక్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నానన్నారు.








