ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

భగవాన్ విశ్వకర్మ విశ్వానికి పరమశిల్పి,దైవికఇంజనీర్

—- తహసిల్దార్ ఎస్. నాగార్జున

విజేత,రాయికల్: భగవాన్ విశ్వకర్మ విశ్వానికి పరమశిల్పి మరియు దైవిక ఇంజనీర్, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి మానస పుత్రుడుగా అవతరించాడని శాస్త్రాలు తెలుపుతున్నాయని రాయికల్ మండల తహసిల్దార్ ఎస్.నాగార్జున అన్నారు.రాయికల్ పట్టణంలో విశ్వబ్రాహ్మణస్వర్ణకార (విశ్వజ్ఞా)మను,మయ సేవా సంఘాలఆధ్వర్యంలో గురువారం భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం నుండి సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి పూలతోప్రత్యేక అలంకరణ,అభిషేకాలు,వేద మంత్రోచ్చారణలతో అష్టోత్తరలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాయికల్ తహసీల్దార్ ఎస్. నాగార్జున హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ నాగార్జున మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో కన్యాసంక్రాతి రోజున విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తారని,దేవతల రక్షణ కోసం విశ్వకర్మ పరమ శక్తివంతమైన ఆయుధాలను, తయారుచేశారు. విశ్వకర్మ భగవానునికి 5గురు కుమారులు వారే మను,మయ,త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ వీరు నుండే ఐదు రకాల శిల్ప,కళారంగాలు, వృత్తులు ఉద్భవించాయని శాస్త్రాలు తెలుపుతున్నాయన్నారు. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు,ఐటీ సంస్థలు మరియు చేతివృత్తుల వారు తమ పనిముట్లను, యంత్రాలను విశ్వకర్మ రూపంగా భావించి పూజిస్తారని ఆయనను పూజించడం వలన వృత్తిలో నైపుణ్యం,విజయం లభిస్తాయని కులవృత్తుల వారు విశ్వసిస్తారన్నారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ, సృష్టికి మూలకర్త, శిల్పకళ, వాస్తుకళ, సకల చేతివృత్తులకు ఆద్యుడు శ్రీ విశ్వకర్మ భగవానుడని కొనియాడారు. ప్రతి సంవత్సరం విశ్వబ్రాహ్మణులు ఐక్యతతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారని, భావితరాల యువత మన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పూజా కార్యక్రమాల అనంతరం సంఘం ఆధ్వర్యంలోభక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ సంఘ సభ్యులు భక్తిశ్రద్ధలతో స్వామివారి అన్నప్రసాదాన్ని అందించారు. శ్రీ విశ్వకర్మ భగవానుడి కృపతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మూ గుల సంజీవచారి,తోగిటి గోపి, పొలాస సింహాచారి,గన్నవరం గంగాధర్,మానాల వెంకటి, కుం రోజువెంకట్రాములు, మానాల శ్రీహరి,పాలిక రవీందర్, పిప్పోజీ మహేందర్ బాబు, గట్టుపల్లి నరేష్ కుమార్, అజయ్ కుమార్, శ్రీగద్దె రాజు, గట్టుపల్లి రమేష్ కుమార్, ఇమ్మడి విజయ్ కుమార్, సంకోజి అశోక్, కుంబోజి కిషన్, గొల్లపల్లి వెంకటరమణ, కుంబోజి రవి, కొడిమ్యాల భాస్కర్, మచ్చ నారాయణ,మోటకాడి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :