
రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సాయం కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం వ్యవసాయ భూమి కేటాయింపునకు హామీ
విజేత,ములకలపల్లి : ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకె శిరీష అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఈ రోజు చౌటిగూడెం గ్రామానికి చేరుకుని శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్ళు తక్షణ నష్టపరిహారంగా రూ.5 లక్షలు అందించేందుకు హామీ ఇచ్చారు అలాగే కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా ఐటీడీఏ ద్వారా అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు కుటుంబ జీవనోపాధికి కొంతమేర వ్యవసాయ ప్రభుత్వ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పటికే శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను గ్రహించి నిందితులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుందని బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.శిరీష కుటుంబానికి వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు న్యాయం జరిగే వరకు కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు ఊకంటి గోపాలరావు గారు బత్తుల అంజి గ ఎండీ జహీరుద్దీన్ గారు,తాండ్ర ప్రభాకర్ సివై సి అధ్యక్షులు పాలకుర్తి సుమిత్ కుంజా వినోద్ కారం సుధీర్ గాడి తిరుపతి రెడ్డి మండల నాయకులు, అనుబంధ సంఘ నాయకులు,అభిమానులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.








