గొల్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

విజేత ఎల్లారెడ్డిపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు ఓసీడీ ప్రొసీడింగ్ పత్రాలను గురువారం సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని, ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య,హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.