పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన జనసేన మహిళా నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ

విజేత. దేవరపల్లి : దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నీటి సంఘ అధ్యక్షులు పుట్టా జయలక్ష్మి రామారావు దంపతులు టివి ఎస్ఎన్ రెడ్డి బళ్ళ రాము రమణ కుమారి దంపతులు నూతన వస్త్రాలను స్వీట్లను ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జనసేన నాయకురాలు దిరిశిన ఫతిమారాణి పుట్టినరోజు కేక్ కట్ చేశారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ పవన్ అన్న జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తముగా ఘనంగా నిర్వహించబడుతున్నాయని వేడుక సందర్భంగా రక్తదానం అన్నదానం మొక్కలు నాటడం దుస్తుల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలని చేపట్టడం జరిగిందని ఫతిమా రాణి అన్నారు.కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు కంబాల సత్తిబాబు అనిశెట్టి గంగరాజు సూరిశెట్టి బాలు జాజిమోగ్గల శ్రీనివాస్ పిల్లా సురేష్ తెదేపా నాయకులు బొల్లిన విజయ భాస్కర్ గద్దె శ్రీనివాస్ పాలపాటి వెంకట గిరి పాలురి బాలాజీ బాజాపా నాయకులు మండ జనార్ధన్ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.