మధిర మున్నూరు కాపు మహిళా టౌన్, మండల కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక..

విజేత, మధిర ఖమ్మం బ్యూరో:  సోమవారం మధిరలోని మున్నూరు కాపు కార్యాలయం వద్ద మధిర మహిళా టౌన్, మండల కమిటీలను మధిర నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ళ కృష్ణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మధిర టౌన్ మహిళా కమిటీ:

అధ్యక్షురాలుగా వేముల శ్రీదేవి, ఉపాధ్యక్షురాలుగా మందడపు వెంకటరావమ్మ, ప్రధాన కార్యదర్శిగా పగడాల శంకరమ్మ, కోశాధికారిగా పుప్పాల పద్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా హనుమంతుల పనిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మధిర మండల మహిళా కమిటీ:

అధ్యక్షురాలుగా తోట దీపకళ, ఉపాధ్యక్షురాలుగా ఆళ్ళ సుష్మ ప్రధాన కార్యదర్శిగా కొట్టే విజయలక్ష్మి, కోశాధికారిగా వట్టివెల్ల త్రివేణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామిశెట్టి రజినిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు ఆళ్ళ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు మహిళా కమిటీలను బలోపేతం చేస్తున్నామని, మహిళల భాగస్వామ్యంతోనే సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. నూతన కమిటీలు మహిళా సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతనంగా ఎన్నికైన మహిళా కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు నాయకులు నియోజకవర్గ అధ్యక్షులు ఆళ్ళ కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, మధిర టౌన్ అధ్యక్షుడు దేవిశెట్టి కృష్ణ, మధిర మండల అధ్యక్షుడు రంగశెట్టి చిరంజీవి 19వ వార్డ్ కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, పసుపులేటి సత్యనారాయణ, జున్ను సుదర్శన్ ,సిధా కృష్ణ , చెన్నం స్వామి, రామిశెట్టి నాగేశ్వరరావు, పాలెపు వెంకటేశ్వర్లు, లంకె మల్ల నాగేశ్వరరావు, చిన్న వెంకటేశ్వర్లు, వీరంశెట్టి సీతారామయ్య ,ఎక్కటీల కృష్ణారావు, ధర్మపురి నరసింహారావు, ఎడ్ల సాంబయ్య, కోల కొండ, నీలం వెంకటేశ్వర్లు , రామిశెట్టి శ్రీనివాసరావు, నల్లగొండ నరసింహారావు, ఇల్లూరి నవీన్, పగడాల శివ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :