
– దసరా నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.
– అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
– సాగునీరు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
– తరిగొప్పుల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి.
విజేత,తరిగొప్పుల: రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.తరిగొప్పుల మండలంలోని బొంత గట్టు నాగారం,బొత్తలపర్రె, జాలుబాయితండా, బోజ్య తండా, కొత్త తండా,అంకుశాపూర్ గ్రామాల్లో వీఓ భవనాల నిర్మాణ పనులకు సోమ వారం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎత్తుగడ్డ ప్రాంతాల్లో ఉన్న బొత్తలపర్రె,జాలుబాయి తండా గ్రామాలకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపడుతున్నామన్నారు .ఎత్తైన ప్రాంతాలకు పైప్లైన్ల ద్వారా నీటిని తీసుకెళ్లే సమయంలోఎదురవుతున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన మోటార్లు, పైప్లైన్లు, విద్యుత్ అనుసంధాన పనులను వేగవంతం చేసి రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దసరా నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి పంట పొలాలకు నీరు అందించడమే లక్ష్యం.సాగునీరు అందుబాటులోకి వస్తే నీటి కొరతతో ఇబ్బందులు పడు తున్న రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.సాగునీరు అందించి రైతులు పంటలను కాపాడుకునేలా చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు.రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసు కుంటున్నానని అన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోంది.మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసు కుంటే ప్రభుత్వ నిధులు కూడా త్వరగా విడుదల అవుతాయి. మొదటి, రెండో విడతల అనంతరం మిగిలిన అర్హులైన పేదలకు మూడో, నాలుగో విడతల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు .గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల సొంతింటి కల నెరవే ర్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, సర్పంచులు కుర్రె మల్లయ్య, భూక్య రవి, బైకని రామ బాలరాజు, దండెం శ్రీనివాస్, మంచినీళ్ళ రాజు, మాజీ ఎంపీటీసీ భూక్య జుమ్లాల్ నాయక్, పెద్ది రాజిరెడ్డి, తేజావత్ గోవర్థన్, నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి,జొన్నగొని సుదర్శన్ గౌడ్, నూకల కృష్ణ మూర్తి,తాళ్ళ పల్లి రాజేశ్వర్ గౌడ్, బుస యాదగిరి, నాగపూరి కిషన్ గౌడ్, ముక్కెర బుచ్చిరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.









