
–వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు
–తాగునీటి పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవో కు వినతి
విజేత,నక్కపల్లి, ప్రత్యేక ప్రతినిధి : మండలంలోని చినదొడ్డిగల్లు పంచాయతీలో గల కొత్తపేటలో పంచాయతీ కుళాయిలోకి మురికి నీరుమురికి నీరు
మిళితమవుతున్నట్లు వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు తెలియజేశారు. దీనివలన ఆ వీధిలో ఉన్నవారందరికీ మంచి నీరు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతునందున ఈ సమస్యను తక్షణo పరిష్కరించాలని కోరుతూ గురువారం ఆయన ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం,వైస్ ఎంపీపీ -1 వీసం నానాజీ, ఉద్దండపురం మాజీ ఎంపీటీసీ బచ్చల రాజులతో కలిసి ఎంపీడీవో బీవీ చలపతిరావుకు వినతిపత్రం అందజేశారు.చినదొడ్డిగల్లు గ్రామంలో గల కొత్తపేటలో ప్రస్తుతం అక్కడ వరకు ఉన్న వీది కుళాయిలోకి మురికి నీరు రావడం వలన అక్కడి వెలగా ప్రకాష్ ఇంటి నుండి విశ్వనాధుల విజయ్ ఇంటికి వరకు జల జీవన్ మిషన్ పథకంలో ఇంటి కుళాయిలు వేయలేదని తెలిపారు.ఆ వీధిలో పంచాయతీ కుళాయి పైప్ లైన్ లోకి త్రాగడానికి ఉపయోగించడానికి పనికిరాని, కలుషితమైన మురికినీరు మిళితం కావడం వల్ల ఆ వీధిలో ఉన్నవారంతా మంచినీరు రాక ఇబ్బంది పడుతున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ విభాగం అధికారులు తక్షణం స్పందించి
ఆ వీదిలో ఉన్న పంచాయితీ కుళాయి పైపులైను మరమ్మత్తు పనులు చేపట్టడం ద్వారా కొత్తపేట కాలనీ వాసులకు మంచినీటి సరఫరా చేపట్టాలని వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు కోరారు.




